కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం : నీలం మధు ముదిరాజ్

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం :  నీలం మధు ముదిరాజ్
  •     నీలం మధు ముదిరాజ్

-పటాన్‌‌చెరు, వెలుగు: సీఎం రేవంత్‌‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. వీరనారి, బహుజన ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ వారసత్వాన్ని గౌరవిస్తూ, ఆమె మనవరాలు చిట్యాల శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బుధవారం చిట్కుల్‌‌లోని నీలం మధు ముదిరాజ్ ఆఫీస్‌‌లో ఆయనను చిట్యాల శ్వేత మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, మిఠాయి తినిపించి నీలం మధు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, సాయుధ పోరాట యోధులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఐలమ్మ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని అన్నారు.