ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ : అద్దంకి దయాకర్ ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ : అద్దంకి దయాకర్ ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికలో ట్విస్ట్. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లకు అవకాశం వస్తుందని అందరూ భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ ను కాదని.. ఆ స్థానంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. మరో అభ్యర్థిగా NSUI నేత బల్మూరి వెంకట్ నర్సింగరావును ఎంపిక అయ్యారు. బల్మూరి వెంకట్ ఎంపిక ఖాయం అని ముందు నుంచీ అనుకుంటున్నారు. అదే విధంగా ఫైనల్ లిస్టులో అతని పేరు ఉంది. అద్దంకి దయాకర్ సైతం ఖాయం అని అనుకున్నా.. చివరి నిమిషం అతను ఊహించని విధంగా నిరాశ ఎదురైంది. 

అసెంబ్లీ ఎన్నికల్లోనూ అద్దంకి దయాకర్ సీటు విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. అదే తరహాలో ఎమ్మెల్సీల ఎంపికలోనూ.. చివరి వరకు ఆయన రేసులో ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. కాంగ్రెస్ అధిష్టానం.. అద్దంకి దయాకర్ ను కాదని.. మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయటం విశేషం. 

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున బీఫారాలు పంపిణీ చేసే బాధ్యతను కాంగ్రెస్ అధినాయకత్వం జగ్గారెడ్డికి ఇచ్చింది. ఈ మేరకు ఆయన బీఫారాలు వీళ్లిద్దరికీ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన వారిలో.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి, హర్కర వేణుగోపాల్ ఉన్నారు. చివరికు అదృష్టం మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ను వరించింది.