పరిషత్ ఎన్నికలు: దక్షిణాది జిల్లాలపై కాంగ్రెస్ ఆశలు

 పరిషత్ ఎన్నికలు: దక్షిణాది జిల్లాలపై కాంగ్రెస్ ఆశలు

పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలన్నీ దక్షిణ జిల్లాలపైనే ఉన్నాయి. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు రావడంతో ఇప్పుడు కూడా లో కల్ బాడీ ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయని పీసీసీ నా యకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలతోపాటు ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో కూడా తమకు మెరుగైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లు వస్తాయని భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన చాలా మంది ఎమ్మె ల్యేలు పార్టీని వీడినప్పటికీ కేడర్ మాత్రం బలంగానే ఉందని,పార్టీని గెలిపించేది కూడా కేడరేనని పీసీసీ నాయకత్వం నమ్ముతోం ది. ఈ జిల్లాల్లో కనీసం రెండు జడ్పీ చైర్మన్లనైనా గెలుచుకోవాలని ముందుకు సాగుతోంది. ఉత్తర తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినప్పటికీ, అవకాశం ఉన్నచోట మాత్రం చేజార్చుకోవద్దని పీసీసీ నేతలు భావిస్తున్నారు. ఆ జిల్లా లు ప్రతిష్టా త్మకం అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో టీఆర్ ఎస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమవగా,కాంగ్రెస్ 9 అసెంబ్లీ స్ థా నాలను గెలుచుకొంది. అయితే అక్కడి నుంచి చాలా మంది ఎమ్మె ల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డప్పటికీ, కేడర్ మాత్రం కాంగ్రెస్ వెంటే ఉన్నం దున మెజార్టీ జడ్పీటీసీలను గెలుచుకునేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. పైగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సొంత జిల్లా కావడంతో ఇప్పడు ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆయనకు సవాల్ గా మారనున్నాయి. ఇదే సమయంలో టీఆర్ ఎస్ కూడా ఖమ్మం జిల్లా జడ్పీని దక్కించుకునేందుకు వ్యూహత్మకంగానే వ్యవహరిస్తోంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో పరిషత్తు ఎన్నికలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. తమ ని యోజకవర్గాల్లో నైనా మెజార్టీ జడ్పీటీసీలను గెలిపించుకొని తమ సత్తాను మరోసారి చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ నేతలు న్నారు. ప్రధానంగా తమ అనుచరులను గెలిపిం చుకుంటేనే జిల్లాలో పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే కోణంలో జడ్పీటీసీ స్థానాలపై సీరియస్ గానే గురిపెట్టారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎమ్మె ల్యేలు సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, మరో సీనియర్ నేత చిన్నారెడ్డి వారిని యోజకవర్గాల్లో అనుచరులను బరిలో నిలిపి గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పార్టీ సీనియర్లు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి నప్పటికీ.. పలువురు మాజీ ఎమ్మె ల్యేలు తమ ని యోజకవర్గాల్లో పార్టీ ఉనికిని కా పాడుకునేందుకు తమ అనుచరులను బరిలో ని లిపి, వారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. మొదటి విడత నా మినేషన్ల ఉప సంహరణ గడువు ఆదివారంతో ము గియడం, ఎన్నికల సంఘం కూడా అదేరోజు గుర్తులు కేటాయించ డంతో మొదటి విడత ఎన్నికలు ఉన్న స్థానాల్లో సోమవారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. మొత్తానికి గెలుపు కోసం అనుకూల జిల్లాలపైనే కాంగ్రెస్‌‌ ప్రత్యేక దృష్టి సారించనుంది.