పీడిత వర్గాల అభ్యున్నతికి ఈశ్వరీ భాయి కృషి చేసిన్రు : గీతారెడ్డి

పీడిత వర్గాల అభ్యున్నతికి ఈశ్వరీ భాయి కృషి చేసిన్రు : గీతారెడ్డి

సమాజంలో నిస్వార్థంగా పనిచేసిన వారికి మరణం ఉండదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్పల్లి సర్కిల్లో నిర్వహించిన ఈశ్వరీ భాయి జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈశ్వరీ భాయి రాజకీయ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేని టైంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చి రాణించారని చెప్పారు.

పీడిత వర్గాల అభ్యున్నతికి ఈశ్వరీ భాయి ఎంతో కృషి చేశారని గీతారెడ్డి తెలిపారు. మహిళా చైతన్యం కోసం కుట్టు మిషన్లు, పెయింటింగ్ వంటి వాటిలో వారిని ప్రోత్సహించారన్నారు. పోలీసుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తారని చెప్పారు. ఆమె ఎక్కడ నుంచి పోటీ చేసినా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఆమె జ్ఞాపకంగా ఈశ్వరీ భాయి మెమోరియల్ నర్సింగ్ హోం స్థాపించి పేద పిల్లల చదువుకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.