
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన తొమ్మిదేండ్ల బాలిక సుష్మ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం కాంగ్రెస్‌నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. బాలిక తండ్రి మహేశ్ మాట్లాడుతూ గతేడాది దసరా రోజు తమ కూతురు సుష్మ అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, పొరపాటున చీమల మందు చల్లిన చపాతిని తినడంతో తీవ్ర అనారోగ్యానికి గురైందని, మెరుగైన వైద్యానికి స్తోమత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.
గాంధీభవన్‌లోని మీడియా ద్వారా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాలిక కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకుని రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు, శస్త్ర చికిత్సలకు అవసరమైన సహాయాన్ని సీఎం సహాయ నిధి నుంచి అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లుగా మహేశ్ తెలిపారు. సహాయం చేయదలచిన దాతలు 95534 61480 కు సంప్రదించాలని కోరారు.