త్వరలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర

త్వరలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర

నిజామాబాద్: సీఎం కేసీఆర్ అవినీతి పాలనపై తమ పోరాటం కొనసాగిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ చెప్పారు. త్వరలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ 11 రోజుల పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలు మతం పేరుతో దేశాన్ని విభజిస్తున్నాయని ఆరోపించారు. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం తెచ్చిందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ముందస్తు ఎన్నికలంటూ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చాయని మధుయాష్కి గౌడ్ మండిపడ్డారు. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ తో కలిసి మీడియా సమావేశంలో  మధుయాష్కి  ఈ కామెంట్స్ చేశారు. 

28న ఢిల్లీలో భారీ ర్యాలీ
ఆగస్టు 28న దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ చెప్పారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో పెరిగిపోయిన నిరుద్యోగం, అవినీతి గురించి ప్రజలకు తెలియజేస్తూ.. సెప్టెంబర్ 7 నుంచి పాదయాత్ర చేపడుతామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని నదీమ్ జావేద్ పేర్కొన్నారు.