మేడిగడ్డ పై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి .. ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్​ నేత నిరంజన్ పిటిషన్

మేడిగడ్డ పై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి .. ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్​ నేత నిరంజన్ పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగి పోవడంపై సీబీఐతో విచారణ జరిపిం చాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ నరేందర్ రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేప థ్యంలో ఈ ప్రాజెక్ట్​లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) పర్యటించి, భద్రతా లోపాలను గుర్తించిందని అందులో పొందుపరిచారు.