అగ్నిపథ్ దేశ యువతను చంపేస్తుంది

అగ్నిపథ్ దేశ యువతను చంపేస్తుంది

న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీం దేశ యువతను చంపేలా ఉందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఆదివారం 'అగ్నిపథ్' రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... అగ్నిపథ్ స్కీంతో ఆర్మీ అంతం అయ్యే ప్రమాదముందని, దాని వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్కీంను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వానికి దురుద్దేశం ఉందని, దాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ ఆస్తులను కాపాడేవారిని ఎన్నుకోవాలని కోరారు. యువత హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా  శాంతియుతంగా పోరాడాలని తెలిపారు. అగ్నిపథ్ స్కీంను వెంటనే రద్దు చేయాలని ప్రియాంక గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.