ఎంత కొట్టాలని అనుకుంటే అంత కొట్టండి.. కానీ సత్యమే గెలుస్తుంది: రాహుల్

ఎంత కొట్టాలని అనుకుంటే అంత కొట్టండి.. కానీ సత్యమే గెలుస్తుంది: రాహుల్

లక్నో: ప్రధాని మోడీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిహార్‌‌‌‌లోని కాంగ్రెస్ ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘ఎప్పటికీ సత్యం, అహింసనే గెలుస్తుంది. వాటి ముందు అసత్యం, హింస నిలవలేవు. మీరు (బీజేపీ) మమ్మల్ని ఎంత కొట్టాలని అనుకుంటే అంత కొట్టండి. కానీ మేం సత్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతూనే ఉంటాం. సత్యమేవ జయతే” అని ‘ఎక్స్‌‌’లో పోస్టు పెట్టారు.