ఎమ్మెల్యే జగ్గారెడ్డి మౌనం వెనుక..? కాంగ్రెస్ క్యాడర్ లో అయోమయం

ఎమ్మెల్యే జగ్గారెడ్డి మౌనం వెనుక..?  కాంగ్రెస్ క్యాడర్ లో అయోమయం

సంగారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ లీడర్లు కన్ఫ్యూజన్ తో తలలు పట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని తెలిసినవాళ్ల మధ్య మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడితే ఒక సమస్య.. మాట్లాడకుంటే ఇంకో సమస్య అంటున్నారు కొందరు లీడర్లు. నోరువిప్పి మాట్లాడితే ఏదో ఒక సెన్సేషన్ కామెంట్స్ చేసే జగ్గారెడ్డి సైలైంట్ గా ఉంటే ఇంకేదో జరుగుతోందంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని జగ్గారెడ్డి గతంలో క్లారిటీ ఇచ్చినా.. లోకల్ గానూ సైలెంట్ గా ఉండడంతో ఏం ట్విస్ట్ ఇస్తారో అర్థం కావట్లేదంటున్నారు.

కొంతకాలంగా ఎవరికీ జగ్గారెడ్డి అందుబాటులో ఉండడం లేదట. దీంతో ఆయన ఏం చేస్తున్నారన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. నిజానికి సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ కేడర్ లో చాలామందిని నయానో భయానో బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. దీంతో వారు జగ్గారెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తారంటూ లోకల్ గా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారమే కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెడుతోంది.

మరోవైపు లోకల్ గా ముందు నుంచి బీఆర్ఎస్ లో ఉన్నవారిలోనూ ఆందోళన కనిపిస్తోంది. జగ్గారెడ్డి విషయంలో జరుగుతున్న ప్రచారమే నిజమైతే మా పరిస్థితి ఆగమవుతుందన్న బాధను వారు వినిపిస్తున్నారు. మా లీడర్ మాకే అందుబాటులో లేడని కాంగ్రెస్ నేతలే చెబుతుంటే.. రేపు మా పరిస్థితి ఏంటని లీడర్ల దగ్గర మొత్తుకుంటున్నారట. మొత్తం మీద మాట్లాడి సొంత పార్టీలో కలకలం రేపే జగ్గారెడ్డి... సైలెంట్ గా ఉండి రెండు పార్టీల్లో టెన్షన్ రేపుతున్నారని లోకల్ గా జోక్ చేసుకుంటున్నారు.