సుల్తానాబాద్‌‌ అభివృద్ధికి రూ.15 కోట్లు..కాంగ్రెస్ లీడర్ల సంబురాలు

సుల్తానాబాద్‌‌ అభివృద్ధికి రూ.15 కోట్లు..కాంగ్రెస్ లీడర్ల సంబురాలు

సుల్తానాబాద్, వెలుగు:  సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు రూ. 15 కోట్లు మంజూరు చేయడంపై పట్టణ కాంగ్రెస్ లీడర్లు ఆదివారం సంబరాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాకులు పేల్చి  స్వీట్లు పంపిణీ చేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. 

కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌‌రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, లీడర్లు రాజమల్లు, అబ్బయ్య గౌడ్, రాజమల్లు, కృష్ణ, రాజలింగం, తిరుపతి  పాల్గొన్నారు