ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు

 ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ​జన్మదిన వేడుకలను నెన్నెల, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని కాంగ్రెస్​నాయకులు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. కేకులు కట్​చేశారు. వేమనపల్లి పీహెచ్​సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

నెన్నెలలో విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి వాలీబాల్, క్రికెట్​కిట్లు అందజేశారు. కార్యక్రమాల్లో  వేమనపల్లి మాజీ జడ్పీటీసీ సంతోష్​ కుమార్, గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ బొమ్మెన హరీశ్​గౌడ్, కోట శ్రీనివాస్, గట్టు మల్లేశ్, మల్లాగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.