మంత్రిపై అసత్య ఆరోపణలు సరికాదు

మంత్రిపై అసత్య ఆరోపణలు సరికాదు

తాడ్వాయి, వెలుగు: పంచాయతీ రాజ్​శాఖ మంత్రి సీతక్కపై బీఆర్​ఎస్​ నాయకుల ఆసత్య ఆరోపణలు సరికాదని కాంగ్రెస్​ మండల ఉపాధ్యక్షుడు ఇప్ప నాగేశ్వరరావు అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్​లో మంత్రిపై బీఆర్​ఎస్​మాజీ జడ్పీ చైర్​పర్సన్​ బడే నాగజ్యోతి చేసిన ఆరోపణలను నిరసిస్తూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నార్లపూర్ కి మంత్రి సీతక్క 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించారన్నారు. 

మరో పది మందికి ఇండ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ, బీఆర్​ఎస్​ నాయకులు మంత్రిపై కక్షతో ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రాపోలు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ ఎనగంటి రామయ్య, మాజీ వైస్ ఎంపీపీ బుర్రి అరుణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.