వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఫర్నిచర్​ మాయం

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఫర్నిచర్​ మాయం
  • ఏసీలు, సోఫాలు 
  • షెడ్డును కూడా వదల్లే..
  • నిరంజన్​రెడ్డిపై కేసు నమోదు చేయాలి 
  • కాంగ్రెస్ లీడర్ల డిమాండ్ 

వనపర్తి, వెలుగు :  వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుంచి రెండు రోజులుగా ఫర్నిచర్, ఇతర సామగ్రిని తరలించిన వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తిలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి క్యాంపు ఆఫీసులో ఫర్నిచర్​ను తన ఇంటికి తరలించారన్న ఆరోపణలు వచ్చాయి.

దీంతో  శుక్రవారం బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్, స్థానిక కాంగ్రెస్ లీడర్​రాచాల యుగంధర్ గౌడ్ ఆర్అండ్ బీ  ఏఈ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును పరిశీలించారు. కార్యాలయంలో ఏసీలు, ఫర్నిచర్ మాయమైందని, బయట ఉన్న షెడ్డును కూడా వదలకుండా ఎత్తుకెళ్లారని చెప్పారు. సామగ్రిని, రేకుల షెడ్డును విప్పి తీసుకెళ్లినా పోలీసులు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. బాధ్యులైన మాజీ మంత్రిపై, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.