బీఆర్​ఎస్​ కుట్రలను తిప్పికొట్టాలి : మట్టా రాగమయి

బీఆర్​ఎస్​ కుట్రలను తిప్పికొట్టాలి : మట్టా రాగమయి

సత్తుపల్లి, వెలుగు : బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఓటర్లను కులమతాలుగా విడగొట్టి ప్రలోభాలకు గురి చేసే కుట్ర చేస్తోందని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని కాంగ్రెస్​ నేతలు డాక్టర్ మట్టా రాగమయి, దాయనంద్​ పిలుపునిచ్చారు. శనివారం ద్వారకాపూరి కాలనీలో గడపగడపకు కాంగ్రెస్​ ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.