కౌశిక్‌‌ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌‌  శ్రేణుల ఆగ్రహం

కౌశిక్‌‌ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌‌  శ్రేణుల ఆగ్రహం

హుజూరాబాద్‌‌ , వెలుగు: ఉద్యమకారుడు మంత్రి పొన్నంపై అవాకులు చెవాకులు పేలుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని హుజూరాబాద్‌‌  నియోజకవర్గ కాంగ్రెస్​ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక అంబేద్కర్​ చౌరస్తాలో కౌశిక్‌‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ బ్లాక్‌‌ మెయిల్​ ఎన్నికల్లో గెలిచిన కౌశిక్‌‌ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.  పార్టీ లీడర్లు కిరణ్ కుమార్, సొల్లు బాబు, కొలిపాక శంకర్, బాబు, మహేందర్ గౌడ్, ప్రతాప నాగరాజు, గోస్కుల రాజు, కిరణ్ రెడ్డి, మిడిదొడ్డి రాజు పాల్గొన్నారు.

జమ్మికుంట/ కరీంనగర్‌‌ ‌‌ సిటీ, వెలుగు: మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌‌ ‌‌ లో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.