కడియం వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ

కడియం వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌/ధర్మసాగర్‌‌‌‌, వెలుగు : మరో ఆరు నెలల్లో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం పడిపోతుందన్న కడియం శ్రీహరి వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ లీడర్లు ఆందోళనకు దిగారు. జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో జడ్పీ స్టాండింగ్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ మారపాక రవి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ ఆఫీస్‌‌‌‌ నుంచి బస్టాండ్‌‌‌‌ సమీపంలోని అంబేద్కర్‌‌‌‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. రాజ్యంగబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేయడం సరికాదన్నారు.

అనంతరం ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌రావుకు ఫిర్యాదు చేశారు. బ్లాక్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు మంచాల అయిలయ్య, మాజీ జడ్పీటీసీ గుర్రం యాదగిరి, పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ దూదిపాల నరేందర్‌‌‌‌రెడ్డి, నాయకులు నగరబోయిన శ్రీరాములు, కాసాని బొందయ్య పాల్గొన్నారు. అలాగే హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు చొల్లేటి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.

ఆరు నెలల్లో సీఎం మారకపోతే కడియం రాజీనామా చేస్తారా అని సవాల్‌‌‌‌ చేశారు. పీసీసీ మాజీ సభ్యుడు గంగారపు అమృతరావు, మండల అధ్యక్షుడు ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు యామిని పాల్గొన్నారు.

విమర్శలు చేస్తే సహించేది లేదు

రఘునాథపల్లి, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్‌‌‌‌రెడ్డి చెప్పారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలోని ఏఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో ఎంపీపీ మేకల వరలక్ష్మి, మండల అధ్యక్షుడు కోళ్ల రవితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనతో విసుగు చెందిన ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్‌‌‌‌కు అధికారం ఇచ్చారన్నారు. జనగామ జిల్లా వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ లింగాజీ, నాయకులు మేకల నరేందర్, మండ రమేశ్‌‌‌‌ పాల్గొన్నారు.