కాకా కుటుంబంతోనే పెద్దపల్లి, చెన్నూరు అభివృద్ధి : కాంగ్రెస్ నాయకులు

కాకా కుటుంబంతోనే పెద్దపల్లి, చెన్నూరు అభివృద్ధి : కాంగ్రెస్ నాయకులు
  • మంత్రి, ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
  • బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్​

కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతం, చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కాకా వెంకటస్వామి కుటుంబం కృషి చేస్తోందని కాంగ్రెస్​ నాయకులు తెలిపారు. శుక్రవారం చెన్నూరు మంత్రి క్యాంపు ఆఫీస్, మందమర్రిలోని బీ–-1 క్యాంపు ఆఫీసుల్లో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కాకా కుటుంబంపై రవికుమార్ గౌడ్​ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 

చెన్నూరుకు చెందిన రవికుమార్ కు కాంగ్రెస్ సభ్యత్వం లేకున్నా నాయకుడిని అని చెప్పుకొని దొంగ దందాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కొంతమంది అవినీతిపరుల ఆటలు సాగుతలేవనే ఉద్దేశంతో అసత్యపు ఆరోపణలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్న ఘనత కాకా కుటుంబానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాకా ఫ్యామిలీ ఎంతో కృషి చేసిందన్నారు. 

మంత్రి, ఎంపీ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాకా కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణకు బేషరతుగా క్షేమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వేర్వేరుగా జరిగిన మీడియా సమావేశాల్లో కాంగ్రెస్​ సీనియర్ లీడర్ సట్ల సంతోశ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ అకారం రమేశ్​,సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు సొత్కు ఉదయ్, మూడారపు శేఖర్, రాయబారపు కిరణ్, ఎండీ జావెద్​ఖాన్, చిప్పకుర్తి శశీధర్, చెన్నూర్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, నాయకులు సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, పెండ్యాల శ్రీకాంత్, చెన్నూరి రాజేశ్, రామగిరి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.