కూటమి ఏర్పాటు చేయాలంటున్న కాంగ్రెస్ నేతలు

కూటమి ఏర్పాటు చేయాలంటున్న కాంగ్రెస్ నేతలు
  • సోనియాతో సమావేశమై చర్చించనున్న ఆజాద్

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. ఘోర ఓటమి నుంచి కోలుకుని అధికారంలోకి రావాలంటే పార్టీ ప్రక్షాళణ చేయాల్సిందేనంటున్న కాంగ్రెస్ సీనియర్లు పలు అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సమావేశం కానున్నారు. నిన్నటి జీ-23 సమావేశంలో ప్రతిపాదించిన అంశాలను సోనియా గాంధీకి వివరించనున్నారు. ఈ సమావేశంలో ప్రియాంక, రాహుల్ గాంధీ కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. 
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతున్న సీనియర్లు.. నిన్న గులాంనబీ ఆజాద్ ఇంట్లో  భేటీ అయ్యారు. పార్టీ బలోపేతంపై అధినేత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి స్థాయిలో సమిష్టి నాయకత్వంతోనే సాధ్యమవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. 2024లో బీజేపీని గద్దెదించాలంటే కాంగ్రెస్ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలతో అధిష్టానం చర్చలు జరిపి కూటమి ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని జీ-23 నేతలు సూచిస్తున్నారు.
అయితే ఈ సమావేశంలో నాయకత్వ మార్పుపై చర్చించలేదు. గాంధీ కుటుంబం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న కపిల్ సిబల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే లేపాయి. మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్లు కపిల్ సిబల్ ను బహిరంగంగానే విమర్శించారు. 

 

ఇవి కూడా చదవండి

28వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

నన్ను అసెంబ్లీలో చూడొద్దన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్