- మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా సాజిదా బేగం పేరు ప్రకటన
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు తమ పార్టీ సభ్యులు, తాను హాజరైనప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఏకమై ప్రజలకు మోసం చేయడానికి చూస్తున్నాయన్నారు.
తమ పార్టీ నుంచి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా సాజిదా బేగం పేరును ప్రకటించారు. సీల్డ్ కవర్లో చైర్పర్సన్ పేరును ఎన్నికల అధికారికి అందజేస్తామని తెలిపారు. కౌన్సిలర్లు రాజురా సత్యం, నిమ్మల రమేశ్, గొర్రె తిరుమల, సాజిదాబేగం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయానంద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
