బిగ్ బ్రేకింగ్ : లోక్ సభ స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థి

బిగ్ బ్రేకింగ్ : లోక్ సభ స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థి

లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలనుకున్న మోదీ సర్కార్ కు బిగ్ షాక్. ఇండియా కూటమి నుంచి కేరళ రాష్ట్రం కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇండియా కూటమి ఇవ్వాలన్న ఇండియా కూటమి డిమాండ్ కు.. మోదీ కూటమి నుంచి సరైన సమాధానం రాకపోవటంతో.. స్పీకర్ ఎన్నికపై విషయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ప్రకటించింది ఇండియా కూటమి. ఈ మేరకు ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేయటం విశేషం.

లోక్ సభ స్పీకర్ ఎంపిక కోసం ఎన్నిక జరగటం 50 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం. ఇన్నాళ్లూ అధికార పార్టీ నుంచి ఏకగ్రీవం అవుతూ వస్తుంది. ఈసారి అందుకు భిన్నంగా స్పీకర్ ఎంపిక విషయంలో ఎన్నిక జరుగుతుంది.

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి అప్పట్లో బీజేపీ ఇచ్చాం అని.. ప్రతిపక్ష హోదా ఉన్న బీజేపీకి ఆ పదవి ఇచ్చాం.. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 99 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. పార్లమెంట్ నియామవళి ప్రకారం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలి. దీనికి బీజేపీ ఆధ్వర్యంలోని ఏన్డీఏ కూటమి ససేమిరా అనటంతో.. స్పీకర్ ఎంపికపై ఎన్నిక అనివార్యం అయ్యింది.