రాబోయేదే కాంగ్రెస్ ప్రభుత్వమే.. నేను కీలక నేతగా ఉంటా : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాబోయేదే కాంగ్రెస్ ప్రభుత్వమే.. నేను కీలక నేతగా ఉంటా : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా : గ్రూప్ 2 పరీక్షలను ఆదరబాదరగా పెట్టి నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆగస్టు 16 లేదా 17వ తేదీ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా బస్సుయాత్ర మొదలు పెడుతామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ 2తో పాటు టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 70వేల మంది టీచర్లు ఉద్యోగ విరమణ చేశారని, ప్రస్తుతం టీచర్లు లేక స్కూల్స్ బంద్ అవుతున్నాయని తెలిపారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ముఖ్య నేతగా ఉంటానని చెప్పారు. 

ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పనుల్లేక ఐదేండ్ల నుంచి ఖాళీగానే ఉంటున్నారని చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ వాళ్లకు విద్యుత్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ ఉంటుందనే విషయం తెలియదన్నారు. ఉచిత కరెంటు ఇచ్చిదే కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా.. మొదటి సంతకం మాత్రం రూ.2 లక్షల రుణమాఫీ, రూ. 4వేల పెన్షన్ అమలుపై చేస్తారని అన్నారు. 5 రకాల గ్యారెంటీ స్కీమ్ లను ప్రజలకు అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై రూ.50 వేల కోట్లు వస్తున్నప్పుడు లబ్ధిదారులకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వడం పెద్ద లెక్క కాదన్నారు. కోకాపేట్ భూములు అమ్మగా వచ్చిన ఆదాయం ఎక్కడకు పోతుందని ప్రశ్నించారు.