అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.  మాజీ సీఎం హరీశ్‌ రావత్ ఇవాళ చేసిన ట్వీట్స్‌ ఆ పార్టీలో ముసలం పుట్టిస్తుందేమోనన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా.. పార్టీ టాప్ ట్రబుల్ షూటర్‌‌గా పేరున్న హరీశ్‌ రావత్.. గాంధీల కుటుంబంపై తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ట్వీట్స్ ఉన్నాయి. ‘‘ఇది ఎంత విచిత్రమో.. ఎలక్షన్స్ అనే సముద్రంలో మనం ఈదాలి. అయితే ఆర్గనైజేషన్ మాత్రం నాకు సపోర్ట్ చేయకుండా వెన్ను చూపిస్తోంది. నేను ఎవరినైతే ఫాలో కావాలో.. వారి మనుషులే నా కాళ్లు చేతులను కట్టేశారు. అది చాలా దూరం వెళ్లింది. మీరు చేసింది చాలు.. ఇది రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అంటున్నారు” అంటూ ట్వీట్స్ చేశారు హరీశ్‌ రావత్. అయితే తాను బలహీనుడిని కాదని, సవాళ్ల నుంచి పారిపోనని, తాను అలజడిలో ఉన్నానని, రాబోయే కొత్త సంవత్సరం తనకు దారి చూపిస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.


 
ఈ ట్వీట్స్‌పై హరీశ్‌ రావత్‌ను మీడియా ప్రశ్నించగా.. టైమ్ వచ్చినప్పుడు తానే చెబుతానంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. మరోవైపు హరీష్ రావత్ ఆయన రోల్ డౌట్‌లో పడిందని,  ఆయన అడ్వైజర్ సురీందర్ అగర్వాల్ చెప్పారు. రాహుల్ గాంధీ ర్యాలీలో దేవేంద్ర యాదవ్ సమక్షంలో హరీశ్ రావత్ పోస్టర్లను తొలగించారని చెప్పారు. కాంగ్రెస్‌లో అంతర్గత కల్లోలాలు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.