కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో  ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.  పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆఫీసులో పార్టీ జెండా అవిష్కరించారు.  జిల్లా లైబ్రరీ చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి, టౌన్​ ప్రెసిదెంట్​ పండ్ల రాజు, బ్లాక్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ గొనే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

జైతాపూర్‌‌‌‌‌‌‌‌లో.. 

ఎడ పల్లి, వెలుగు:  ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నూరు మోహన్ రెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్​ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్​ పార్టీ మద్దతుదారుడు నాగుల రాజు గౌడ్ ఎన్నిక కావడంతో గ్రామ కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ  దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఉప సర్పంచ్ భార్గవ్, పార్టీ ఉపాధ్యక్షుడు గొడితే నవీన్, మాజీ సర్పంచ్ దోమటి పరశురాం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఆదివారం డీసీసీ ఆఫీస్​లో నాయకులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్​ కాటిపల్లి నాగేశ్ రెడ్డి పార్టీ జెండా ఎగురేసి ప్రసంగించారు.  త్యాగాల చరిత్రపై కాంగ్రెస్​ పునాది నిర్మితమైందన్నారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్​ తాహెర్, టీపీసీసీ జనరల్​సెక్రెటరీ రాంభూపాల్, లైబ్రరీ కమిటీ ఛైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర పార్టీ ప్రెసిడెంట్​ బొబ్బిలి రామకృష్ణ, రత్నాకర్​ ఉన్నారు.

నందిపేట, వెలుగు: నందిపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్, మదారొద్దీన్​, భూమేశ్, లోక హన్మండ్లు, నసీరొద్దీన్​ తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ 141వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఆదివారం లింగంపేట మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్​మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్​ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లను పంపిణీ చేశారు.