మల్కాజ్​గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్​కు జోష్

మల్కాజ్​గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్​కు జోష్

 బీఆర్ఎస్ 23 ఏండ్ల చరిత్రలో నల్గొండ, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ఎంపీ స్థానాలు కొరకరాని కొయ్యగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లు ఉండగా.. 14 చోట్ల ఏదో ఒక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ, ఈ మూడు స్థానాల్లో మాత్రం కారు పార్టీకి ఎంట్రీ దొరకలేదు. కేసీఆర్ టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీని 2001లో ఏర్పాటు చేశారు. ఈ 23 ఏండ్లలో నాలుగు సార్లు లోక్​సభ ఎన్నికలు జరిగాయి. కానీ, నల్గొండ, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరిలో మాత్రం బీఆర్ఎస్ ఇంతవరకు గెలవలేకపోయింది. గడిచిన పదేండ్లు రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన సందర్భంలో కూడా ఈ మూడు స్థానాలపై బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది.

మల్కాజ్​గిరిలో కాంగ్రెస్​కు జోష్ 

2009లో జరిగిన డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మల్కాజ్​గిరి నియోజకవర్గం ఏర్పడింది. అక్కడ ఇప్పటి వరకు మూడు సార్లు లోక్​సభ ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ రెండుసార్లు, టీడీపీ ఒకసారి గెలిచాయి. 2009లో ఈ స్థానంలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. 2014లో మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేయగా.. ఆయన రెండోస్థానంలో నిలిచారు. టీడీపీ నుంచి మల్లారెడ్డి విజయం సాధించారు.

 ఆ తర్వాత మల్లారెడ్డి టీడీపీ నుంచి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎంపీగా పోటీ చేయగా.. ఆయనపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విజయం సాధించారు. అయితే, ఇక్కడ ఈసారి మల్లారెడ్డిని గెలిపిస్తారని కేసీఆర్ ఆశలు పెట్టుకుంటే ఆయన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ALSO READ :- ఎలక్షన్ ప్రచారంలో లేనిది ఉన్నట్లు..ఉన్నది తప్పుగా

 అలాగే, బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండడం కూడా కారు పార్టీపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో జోష్ వచ్చినట్టు అయింది.