పెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకూ పోరాటాలు

పెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకూ పోరాటాలు

పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల రేట్లు, ఆర్టీసీ విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకు తమ పార్టీ నిత్యం పోరాటాలు సాగిస్తుందని ఆయన హెచ్చరించారు. టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో రేవంత్ మాట్లాడారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలను కొనసాగించాలని రేవంత్ అన్నారు. ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు విజయవంతంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తమ పక్షాన పోరాటం చేస్తుందని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు కొనసాగించాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి వరి గింజ కొనేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసనగా ఉద్యమాలు చేయాలని రేవంత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారని అన్నారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ సమస్యను పక్కదారి పట్టించకుండా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

కచ్చాబాదం సాంగ్కు డ్యాన్స్ చేసిన మాధురీ దీక్షిత్

తల్లిని వదిలి హాస్టల్‌కు వెళ్లలేకనే కిడ్నాప్​ డ్రామా

గ్రూప్ 1, 2 రిక్రూట్‌‌మెంట్‌‌లో మార్పులు?