బెల్లం మొక్కులు చెల్లించి కాంగ్రెస్​ నిరసన

బెల్లం మొక్కులు చెల్లించి కాంగ్రెస్​ నిరసన

వేములవాడ, వెలుగు: వేములవాడను అభివృద్ధి చేసేలా కేసీఆర్​కు బుద్ది ప్రసాదించు రాజన్నా అంటూ.. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​ స్వామివారిని వేడుకున్నారు. ఆలయ అభివృద్ధి, ముంపు గ్రామాల సమస్యలపై సీఎం కేసీఆర్​స్పందించాలని మంగళవారం స్వామివారికి బెల్లం మొక్కులు చెల్లించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 ఏండ్ల కింద రాజన్న ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్.. ఇక్కడే తన లగ్గం అయిందని, ఆలయాభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తానని చెప్పి మాట తప్పారన్నారు. ఆలయాభివృద్ధి, పట్టణాభివృద్ధిపై  ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో లీడర్లు చిలుక రమేశ్‌, శ్రీనివాస్ గౌడ్, కొమురయ్య, సత్యలక్ష్మి, రాకేశ్‌, లహరి, పరశురాం, కృష్ణగౌడ్​, విష్ణు, మస్తాన్, మల్లేశం, దేవరాజం ఆగయ్య, మహేశ్‌, శ్రీనివాస్ పాల్గొన్నారు. 

భిక్షాటన చేసిన యూత్ కాంగ్రెస్ లీడర్లు

తంగళ్లపల్లి, వెలుగు: రైతులు వడ్లు అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వారి ఖాతాల్లో పైసలు పడలేదని యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మునిగేలా రాజు ఆరోపించారు.  రైతుల విషయంలో సర్కార్​ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం యూత్ కాంగ్రెస్ లీడర్లు మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. కార్యక్రమంలో లీడర్లు గుగ్గిళ్ల భరత్, అరెపల్లి బాలు, తిరుపతి , శ్రీనివాస్ , యోగి, సలీం, ఉమాశంకర్, విజయ్, సూర్య, విక్కి పాల్గొన్నారు.