కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
  •     టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సదాశివపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సూచించారు. గురువారం సదాశివపేట మున్సిపాలిటీ లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిందని మొత్తం 26 వార్డులకు 25 వార్డుల అభ్యర్థుల అధికారికంగా వెల్లడించామన్నారు. కాంగ్రెస్​బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​చార్జి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి , పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ పొల్గొన్నారు.

కాంగ్రెస్​పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. పిల్లోడి విశ్వనాథం, ఎరుకల నర్సింహులు, రేణుక, ఎండీ మోయిజ్, ఖుతేజా ఫాతిమా, పాతదొడ్డి అనిత, సీహెచ్. రేణుక, అరుణ్ కుమార్, నర్సింహులు గౌడ్, గోపి ప్రియాంక, పులిమామిడి మమత, పిల్లోడి భవాణి, రాయపాడు స్వరూప, గౌసియా బేగం, కొత్తగొల్ల చంద్రశేఖర్, ఎండీ. షాజీ, ఆకుల నిఖిత, పట్లూరి రోజా, మునిపల్లి అంజమ్మ, ఎండీ. వాజీద్, పతనం విజయ లక్ష్మి, వానగంటి లక్ష్మి ప్రియ,  ఎండీ. కలీమ్, శంకర్ గౌడ్, కావులే హారిక పాల్గొన్నారు.