పార్లమెంట్ సెషన్‌‌‌లో బార్డర్ వివాదంపై చర్చించాలి

పార్లమెంట్ సెషన్‌‌‌లో బార్డర్ వివాదంపై చర్చించాలి

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్

న్యూఢిల్లీ: లడఖ్‌‌లో చైనా తన భూభాగాన్ని ఆక్రమించడాన్ని భారత్ ఎంతమాత్రం సహించబోదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పారు. పీఎం కేర్స్ ఫండ్ నియంత్రణ విషయంలో పారదర్శకతపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలీఫ్ ఫండ్‌‌‌కు పలు చైనా కంపెనీలు ఇచ్చిన విరాళాలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పీఎం కేర్స్‌‌‌‌ను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘లడఖ్‌‌లో మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి, ఎల్ఏసీ వద్ద యథాతథ స్థితికి భంగం కలిగించేందుకు చైనా యత్నిస్తున్నప్పుడు ఆ దేశ కంపెనీలు పీఎం కేర్స్ ఫండ్‌‌‌కు ఎందుకు డొనేట్ చేస్తున్నాయి? సరిహద్దు వద్ద ఎలాంటి దురాక్రమణలు జరగలేదని అనడం ద్వారా ప్రధాని మోడీ దేశాన్ని బలహీనం చేస్తున్నాయి. త్వరలో మొదలవనున్న పార్లమెంట్ సెషన్స్‌‌‌లో బార్డర్‌‌లో చైనాతో నెలకొన్న ప్రతిష్ఠంభనపై చర్చ జరపాలి’ అని జైరాం పేర్కొన్నారు. 1962 చైనాతో యుద్ధం సమయంలో ఆ విషయంపై అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌‌లో డిబేట్ పెట్టారని గుర్తు చేశారు.