ఎంపీ వంశీకృష్ణను చిన్నచూపు చూస్తే సహించం.. ప్రొటోకాల్ ఇవ్వొద్దని చెప్పిందెవరు?: కాంగ్రెస్ సీనియర్ లీడర్స్

ఎంపీ వంశీకృష్ణను చిన్నచూపు చూస్తే సహించం.. ప్రొటోకాల్ ఇవ్వొద్దని చెప్పిందెవరు?: కాంగ్రెస్ సీనియర్ లీడర్స్
  • అగ్రవర్ణ అజమాయిషీ ఇంకా కొనసాగుతోందా?
  • అధికారులు వెంటనే వెల్లడించాలె 

పెద్దపల్లి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రొటోకాల్ ఇవ్వొద్దని చెప్పిందెవరో వెంటనే అధికారులు వెల్లడించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ సజ్జాద్ డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యుడిపై వివక్ష చూపడం దారుణమని ఫైర్ అయ్యారు. పెద్దపల్లి లో సయ్యద్మాట్లాడుతూ పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రెండేండ్లుగా ఎంపీ పట్ల చూపెడుతున్న వైఖరి గర్హనీయమన్నారు. ఈనెల 24న జరిగిన ఇందిరమ్మ సంబరాలు చీరల పంపిణీ కార్యక మానికి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా అవమానపరిచారని ఆవేదన చెందారు. 

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్ర మంలో స్థానిక ఎంపీకి ప్రొటోకాల్ ఉండదా అని ప్రశ్నించారు. అధికారులు కావాలనే చేస్తున్నారా లేక ఎవరైనా, అధికారులను ప్రోత్సహిస్తున్నారా అనేది తేలాలన్నారు. ఇటీవల రామగుండంలో. ఈఎస్ఐఐ ఆస్పత్రి నిర్మాణ పరిస్థితులు పరిశీలించే క్రమంలో, అధికారులకు సమాచారం ఇచ్చినా .. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. ఎంపీకి జరుగుతున్న అన్యాయంపై చీఫ్ సెక్రట రీ తో పాటు లోక్ సభ స్పీకర్ కు అలాగే ఎస్సీ ఎస్టీఅధికారులను సస్పెండ్ చేయాలి

గోదావరిఖని: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రొటోకాల్ ను విస్మరించిన అధికారులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పదేపదే ఎంపీ విషయంలో అధికారులు ప్రొటోకాల్ ను ఎందుకు తప్పుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. 

ఇకపై ఎంపీ వంశీ కృష్ణసు చిన్నచూపు చూస్తే సహించేది లేదు. కాకా వెంకట స్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఎనలేని సేవలు అందించారు' అని గుర్తుచేశారు.కమిషనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బండారి సునీల్, గంగుల సంతోష్, పెరుక నవీన్, సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్, తాజోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.