
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాయ్‌బరేలి నియోజకవర్గంలో ఇవాళ(బుధవారం) ఆమె పర్యటిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. ఆ పార్టీ ఇప్పటికే ఘోరంగా విఫలమైందన్నారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.. బీజేపీకి గట్టి పోటీని ఇవ్వబోతున్నారని ప్రియాంక తెలిపారు. యూపీలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ – సమాజ్‌వాదీ పార్టీ కూటమి తరపున ఎవరూ పోటీ చేయడం లేదు. ఈ నియోజకవర్గానికి మే 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.