విజయభేరితో ఓఆర్ఆర్​పై.. 10 కి.మీ. ట్రాఫిక్ జాం

విజయభేరితో ఓఆర్ఆర్​పై.. 10 కి.మీ. ట్రాఫిక్ జాం

తుక్కుగూడ, వెలుగు: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభతో  ఔటర్​ రింగ్​రోడ్డుపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జాం అయ్యింది. విజయబేరి సభ ప్రారంభమయ్యే సమయానికి ఒక్క సారిగా వాహనాలన్నీ  శ్రీశైలం హైవేపైకి వచ్చాయి. దాంతో ఓఆర్ఆర్ పై పెద్ద గోల్కొండ ఎగ్జిట్​ నంబర్-15 నుంచి బొంగులూర్​ ఎగ్జిట్ నంబర్-12 వరకు దాదాపు రెండు గంటలు ఎక్కడివక్కడ వెహికల్స్ నిలిచిపోయాయి. 

 

Also Rard:   ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు షాక్: కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్  చైర్ పర్సన్ స్రవంతి

దాంతో  జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో  బస్సులు, డీసీఎంలు, కార్లలో విజయభేరికి బయలుదేరిన కాంగ్రెస్  కార్యకర్తలంతా  ట్రాఫిక్ కారణంగా మీటింగ్ కు హాజరు కాకుండానే  వెనుదిరిగారు. మీటింగ్​ ముగిసే సమయానికి ట్రాఫిక్​ జాం పూర్తిగా తగ్గింది.