మమతా బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ ఒకే

మమతా బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ ఒకే

రాష్ట్రపతి ఎన్నిక దేశంలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ ఎన్నికలో గెలుపుకోసం అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షాలు  తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులోభాగంగా జూన్ 15 ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దానికి కాంగ్రెస్ సహా అన్ని విపక్ష పార్టీలను ఆహ్వానించింది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ వెళ్తుందా లేదా అన్న ప్రశ్నకు ఆ పార్టీ సమాధానం చెప్పింది. మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నేతలు  మల్లిఖార్జున్ ఖర్గే,  జైరాం రమేష్,  రణదీప్ సుర్జేవాలా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను అభ్యర్థిగా నిలబెట్టాలని విపక్షాలు ప్రయత్నాలు చేశాయి. అయితే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడం లేదని పవార్ స్పష్టం చేశారు. దీంతో మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ఇక మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి శరద్ పవార్ కూడా హాజరుకానున్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరగనుండగా బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. గత ఎన్నికల్లో ఎన్టీయేకు శివసేన, వైసీపీలు బయటనుండి సపోర్ట్ చేయగా..ఈ సారీ ఎన్టీయేకు ఏఏ పార్టీలు మద్ధతు ఇస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.