2,000 కంటే తక్కువ మెజార్టీతో 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్

2,000 కంటే తక్కువ మెజార్టీతో 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాల్లో 40 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో 2,000 కంటే తక్కువ తేడాతో విజయం సాధించారు. భోరంజ్, సుజన్‌పూర్, దరాంగ్, బిలాస్‌పూర్, శ్రీ నైనా దేవి, రాంపూర్, షిల్లై, శ్రీ రేణుకాజీలలో 1,000 ఓట్లలోపు తేడాతోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భట్టియాత్, బల్హ్, ఉనా, జస్వాన్ ప్రాగ్‌పూర్, లాహౌల్ , స్పితి, సర్కాఘాట్ , నహాన్‌లలో 1,000 నుండి 2,000 ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు వచ్చినా ఓట్ల శాతంలో తేడా 0.90 శాతం మాత్రమే.

8 మంది మంత్రులు ఓటమి 
 

12మంత్రులతో ఉన్న  జై రామ్ ఠాకూర్ క్యాబినేట్ లో ఏకంగా 8 మంత్రులు ఓటమి పాలు కావడం బీజేపీకి షాక్ కు గురి చేసింది. గోవింద్ సింగ్ ఠాకూర్, రామ్ లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సెజల్, సర్వీన్ చౌదరి, వీరేందర్ కన్వార్‌, సురేష్ భరద్వాజ్, రాకేష్ పఠానియా ఓటమి పాలయ్యారు. 

జై రామ్ ఠాకూర్ రాజీనామా 

హిమాచల్ లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవికి జైరామ్ ఠాకూర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌కు అందజేశారు. ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్న ఆయన..రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతామన్నారు. లోపాలను విశ్లేషించుకుని ముందుకు వెళ్తామన్నారు.