మంత్రి సోమన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళనలు

మంత్రి  సోమన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళనలు

కర్ణాటకలోని బెంగళూరులో గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు .  సమస్యను పరిష్కరించాలంటూ చెప్పేందుకు వచ్చిన మహిలపై మంత్రి దాడి చేశారంటూ ఫైర్ అయ్యారు. నిన్న చమరాజ్ నగర్ జిల్లాలో భూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ  కార్యక్రమంలో ఓ మహిళ అర్హత ఉన్న తనకు పట్ట ఇవ్వలేదంటూ మంత్రి దగ్గరికొచ్చిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే మంత్రి తనకు సమధానం చెప్పాల్సింది పోయి ఆమెపై దాడి చేశారంటూ ఫైర్ అయ్యారు. దాడిని నిరసిస్తూ ధర్నాకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.