తనపై BJP ఎంపీ దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

తనపై BJP ఎంపీ దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

బీజేపీ ఎంపీ తనపై దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాసు సోమవారం లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. లోక్ సభలోనే  తనపై దాడికి పాల్పడిందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు ఆమె కంప్లయింట్ చేశారు.

ఢిల్లీలో జరిగిన హింసపై సోమవారం ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అందుకు బాధ్యత వహిస్తూ.. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు లోక్ సభలో ఒకరినొకరు నెట్టుకున్నారు.

“మార్చి 2 న లోక్ సభ లోపల మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎంపి జస్కౌర్ మీనా (రాజస్థాన్ సభ్యురాలు) నాపై శారీరకంగా దాడి చేశారు” అని హరిదాస్ తన ఫిర్యాదులో తెలిపారు. స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదులో, ఆమె దళిత వర్గానికి చెందిన మహిళనే కాబట్టి ఇలాంటివి పదేపదే జరుగుతున్నాయా అని ఆమె అడిగారు. ఇందుకు కారణమైన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.