హిందుత్వను ఐసిస్‎తో పోల్చిన కేంద్ర మాజీ మంత్రి ఇంటికి నిప్పు

హిందుత్వను ఐసిస్‎తో పోల్చిన కేంద్ర మాజీ మంత్రి ఇంటికి నిప్పు

అయోధ్య గురించి బుక్ విడుదల చేసిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి జరిగింది. నైనిటాల్‎లోని ఆయన ఇంటిని కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను ఖర్షీద్ తన ఫేస్‌బుక్‌లో పేజీలో పోస్ట్ చేశారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆయన.. నేను చెప్పింది ఇప్పటికీ తప్పేనా అని ప్రశ్నించారు. కాగా.. ఖర్షీద్ ఇంటిపై దాడికి సంబంధించి.. రాకేష్ కపిల్‎తో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేయబడిందని.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజీఐ నీలేష్ ఆనంద్ చెప్పారు.

ఖుర్షీద్ అయోధ్య గురించి చెబుతూ.. ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ ను విడుదల చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఖుర్షీద్ తన బుక్ లో రాసిన వాఖ్యాలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని.. ముస్లిం ఓట్లను కార్నర్ చేసేందుకే కాంగ్రెస్ మత రాజకీయాలను చేస్తోందని బీజేపీ ఆరోపించింది. హిందుత్వను ఐసిస్ మరియు జిహాదిస్ట్ ఇస్లాంతో పోల్చడం తప్పని సొంతపార్టీకి చెందిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.