కళ్లద్దాలకు యమ గిరాకీ.. ధరలు పెంచేసిన వ్యాపారులు

కళ్లద్దాలకు యమ గిరాకీ.. ధరలు పెంచేసిన వ్యాపారులు

దేశంలో కండ్ల కలక కలకలం సృష్టిస్తోంది.  ముఖ్యంగా  కర్ణాటకలో కండ్ల కలక భయాందోళనకు గురిచేస్తోంది. ఆ రాష్ట్రంలో  జులై 25 నుంచి ఆగస్టు  4 వతేదీ వరకు  40 వేల 477  కండ్లకలక కేసులు నమోదయ్యాయి.  

కర్ణాటకలోని బీదర్ ( 7వేల693)లో కేసులు, హవేరీలో  ( 6వేల6558) , రాయచూర్ ( 6 వేల 493) కేసులు నమోదయ్యాయి.  ఇక శివమొగ్గ (3 వేల 411), హాసన్ ( 1279), విజయనగర (2 వేల 200), బెలగావి  ( 1843 కేసులు) నమోదయ్యాయి. బెంగళూరులోని మహానగర పాలికే (బీబీఎంపీ) పరిధిలో 400 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వ్యాధి నుండి రక్షణ పొందడానికి  డార్క్ షేడ్ సన్ గ్లాసెస్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో కర్ణాటకలో సన్ గ్లాసెస్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 

సన్ గ్లాసెస్కు డిమాండ్ ..

కర్ణాటక కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతుండటంతో...అధిక సంఖ్యలో ప్రజలు సన్ గ్లాసెస్ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా బీదర్‌లో సన్ గ్లాసెస్ అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో వ్యాపారులు సన్ గ్లాసెస్ ధరను భారీగా పెంచేశారు. గతంలో 50 నుంచి 80 రూపాయలు ఉన్న గ్లాసెస్..ఇప్పుడు రూ. 100 పైనే అమ్ముతున్నారు.  బీదర్‌లో స్థానికులు 100 నుండి 120 రూపాయల ధరకు గ్లాసెస్ను  కొనుగోలు చేస్తున్నారు. బీదర్లోని భగత్ సింగ్ సర్కిల్, శివాజీ సర్కిల్, నంది పెట్రోల్ పంప్ దగ్గర సన్ గ్లాసెస్ దుకాణాలకు జనం పోటెత్తారు. కండ్ల కలక నుంచి రక్షించుకోవడానికి,  ఇన్ఫెక్షన్ నుండి తమను తాము కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ను కొనుగోలు చేస్తున్నారు.