
తమిళ ఇండస్ట్రీలో ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ ఐన సినిమా కంజూరింగ్ కన్నప్పన్(Conjuring Kannappan). దర్శకుడు సెల్విన్ రాజ్ జేవియర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సతీష్, రెజీనా, నాసర్, శరణ్య ముఖ్యపాత్రల్లో నటించారు. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ హారర్-థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ.
రిలీజై నెలరోజులు కావస్తున్నా నేపధ్యంలో కంజూరింగ్ కన్నప్పన్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం తమిళ్‌లోనే కాకుండా.. తెలుగు, మలయాళం, కన్నడలో కూడా అందుబాటులోకి రానుంది. మరి థియేటర్స్ లో సూపర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.