బీసీ కోటా కోతకు కుట్ర

బీసీ కోటా కోతకు కుట్ర

తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను తగ్గించటంలో రాష్ట్ర ప్రభుత్వం​ అడుగడుగునా కుట్రపూరితంగా వ్యవహరించింది. తెలివిగా కోర్టుల్లో అనుకూల తీర్పులు వచ్చేలా చేసుకుంటున్నది.

మునిసిపల్ ఎన్నికల్లోనూ  ఈ అంశం అడ్డం రాకుండా చూసుకుంటున్నది.  బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 1986–87 నుంచి అమలవుతున్నాయి. 1991 నుంచి 34 శాతం కొనసాగుతున్నాయి. రిజర్వే షన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు 2010లో చెప్పింది. దీన్ని ఆసరా చేసుకొని బీసీ వ్యతిరేకులు హైకోర్టుకు వెళ్లగా వారికి అనుకూల తీర్పొచ్చింది. అయితే.. బీసీ సంక్షేమ సంఘం పోరాటం, తెలంగాణ ఉద్యమంతోపాటు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ‘ఎస్టో ఫెల్’ సహజ న్యాయ సూత్రాల ప్రకారం హైకోర్టు తీర్పు రద్దయింది.

అంతకుముందు ఉన్నట్లుగానే మళ్లీ 34 శాతం బీసీ రిజర్వే ష న్లకు మార్గం సుగమమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీసీలు తమ రిజర్వే షన్ల వాటా 50 శాతానికి పెరుగుతుందని, జనాభా దామాషా ప్రకారం అది సాధ్యమేనని అనుకున్నారు. దానికి తగ్గట్లే ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన స్టైల్లో మొత్తం రిజర్వే షన్లను తమిళనాడు తరహాలో 60 శాతానికి పైగా పెంచుతానని హామీ ఇచ్చారు. దీనికోసం బీసీ కమిషన్ ని తమిళనాడు తదితర రాష్ట్రాలకు పంపించి రిపోర్ట్ లు తెప్పిస్తా నని చెప్పారు.

కానీ.. ఏం జరిగింది?

సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం పెంచే బీసీల రిజర్వే షన్లలో 36 లక్షల కుటుంబాలున్న ఎంబీసీలకూ న్యాయమైన వాటా వస్తుందని సీఎం కేసీఆర్ ఆశలు రేకెత్తించారు. అయితే.. ఇదంతా పైపే మాటలే అని తేలటానికి ఎంతో సమయం పట్టలేదు. బీసీలను మోసగించి రిజర్వే షన్లను సగానికి తగ్గించారు. ఉద్దేశపూర్వకంగా టెక్నికల్ ఇష్యూస్ ని సృష్టించి, వాటిని సాకుగా చూపి కోర్టుల్లో నెట్టుకొచ్చారు. సాధారణ ఎన్నికలకు ముందు అన్ని పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో 2017 డిసెంబర్ 3న అసెంబ్లీలో సమావే శం ఏర్పాటు చేశారు. బీసీల రిజర్వే షన్ల పెంపు సహా అన్ని డిమాండ్లు ఓకే చేస్తామని ప్రకటించారు. రిజర్వే షన్లను 54 శాతానికి పెంచాలనే డిమాండ్ తో బీసీ సంక్షేమ సంఘం చేస్తున్న ఉద్యమానికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కొనసాగుతుండగా బీసీల జనాభా లెక్కలు రెడీగా ఉంటే వాటి ప్రకారం రిజర్వే షన్లను పెంచుకోవచ్చని జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం చెప్పింది.

మనసు రాలేదు!

సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన బీసీల జనాభాను అఫిషియల్ గా ప్రకటించి 53 శాతం రిజర్వే షన్లతో ఏడాది కిందటే స్థానిక సంస్థల ఎన్ని కలు జరిపించాల్సింది. కానీ.. ప్రభుత్వం ఒప్పుకోలేదు. 2010 నాటి రిజర్వే షన్ల పరిమితి తీర్పుని తిరగదోడించారు. స్థానిక సంస్థల ఎన్ని కలను సాధారణ ఎన్నికల తర్వా త జరిపించే తెలివైన కుట్రకు ఈ తీర్పును ప్రభుత్వం వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వ బీసీల రిజర్వే షన్ల వ్యతిరేక ధోరణి మొదటి నుంచీ ఉన్నదే. అదిప్పుడు పరాకాష్టకు చేరిందనటానికి ఈమధ్య జరుగుతున్న సంఘటనలే ఉదాహరణలని చెప్పొచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో కేసీఆర్ ప్రభుత్వం బీసీల రిజర్వే షన్ల తగ్గింపుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. 34 శాతంగా ఉన్న బీసీల రిజర్వే షన్లను ఓ ఆర్డినెన్స్​ ద్వా రా ఏకంగా 18 శాతానికి కుదించి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపించారు.

లీగల్ అభ్యంతరాలకు ఛాన్స్​ ఇవ్వకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదాక ఆ ఆర్డినెన్స్​ని వెబ్ సైట్ లో పెట్టలేదు. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీ ల్ ఉన్నా టెక్నికల్ ఇష్యూస్ ని ఉపయోగించి ఈ ఏడాది జనవరిలో ‘పంచాయతీ’ పని కానిచ్చారు. అదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్ని కలకూ రెడీ అవుతున్న క్రమంలో ‘స్టే’ పిటిషన్ విచారణకు వచ్చింది. బీసీల రిజర్వే షన్లను తగ్గించిన డాక్యుమెంట్ చూపించాలని జడ్జి అడిగారు. కానీ.. ఆ ఆర్డినెన్స్​ ప్రభుత్వ వెబ్ సైట్ లో లేనందున మేం ఇవ్వలేకపోయాం. దీంతో కోర్టు న్యాయం చేయలేకపోయింది.

మునిసిపల్ ఎన్నికల కోసం కొత్త ఎత్తు గడ

బీసీల రిజర్వే షన్ల తగ్గింపుపై దాఖలైన పిటిషన్ పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తగ్గించిన బీసీల రిజర్వే షన్లతో మునిసిపల్ ఎన్ని కలకు పోలేని స్థితిలో ప్రభుత్వా నికి మరో సరికొత్త కుట్ర అవసరమైంది. బీసీలతో ఏర్పాటు చేసిన ఓ సంస్థ ద్వా రా ‘మునిసిపల్ ఎన్ని కలను గడువులోగా జరిపించాలనే ఉద్దేశం’తో కోర్టులో పిటిషన్ వేయించారు. దీనిపై ప్రభుత్వా నికి అనుకూల తీర్పు వచ్చింది. 150 రోజుల్లో గా మునిసిపల్ ఎన్నికలు జరపడానికి వీలు దొరికింది. దాని ద్వారా సర్కారు రెండు ప్రయోజనాల్ని ఆశించింది. 1.. బీసీల రిజర్వే షన్ల తగ్గింపు క్రమబద్ధీకరణ. 2.. మునిసిపల్ ఎన్నికలను కూడా తొందరగా పూర్తిచేయటం. ఈ రెండూ అనుకున్నవి అనుకున్నట్లు అయిపోతే ఇక ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం లేదని కేసీఆర్ గవర్నమెంట్ భావిస్తోంది. బీసీల రిజర్వే షన్లపై తుది తీర్పివ్వటం కోసం కోర్టులు అడుగుతున్న కౌంటర్లను నెలల తరబడి వేయకుండా దాటవేస్తూ బీసీల రాజ్యాం గపరమైన హక్కులను హరిస్తోంది.

ఎర్ర సత్యనారాయణ, ప్రెసిడెంట్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం