మిషిగన్​ గవర్నర్​ కిడ్నాప్​కు కుట్ర

మిషిగన్​ గవర్నర్​ కిడ్నాప్​కు కుట్ర
  •    డెమొక్రటిక్​ గవర్నర్​ గ్రెషెన్​ వైట్మర్​కిడ్నాప్​కు మిలిటెంట్ల ప్లాన్​
  •    భగ్నం చేసి 13 మందిని అరెస్ట్​ చేసిన ఎఫ్​బీఐ అధికారులు
  •    ప్రెసిడెంట్​ ట్రంప్​, గవర్నర్​ వైట్మర్​ మధ్య మాటల యుద్ధం

వాషింగ్టన్అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న టైమ్​ ఇది. ఇప్పటికే ప్రచారాలూ జోరుగా జరుగుతున్నాయి. ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​, అపోజిషన్​ డెమొక్రటిక్​ ప్రెసిడెంట్​ క్యాండిడేట్​ జో బైడెన్​ల మధ్య డిబేట్లూ మొదలయ్యాయి. ఇలాంటి టైంలో మిషిగన్​ స్టేట్​ గవర్నర్​ గ్రెషెన్​ వైట్మర్​ కిడ్నాప్​ కుట్ర కలకలం సృష్టించింది. బైడెన్​ ఎలక్షన్​ ప్రచారానికి ఆమె కో చైర్ పర్సన్​ కూడా అవడంతో మరింత కలవరం రేగింది. ముందుగానే ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​ (ఎఫ్​బీఐ) అధికారులు కిడ్నాప్​ కుట్రను భగ్నం చేసి.. 13 మందిని అరెస్ట్​ చేశారు. అయితే, కిడ్నాప్​ కుట్రపై ప్రెసిడెంట్​ ట్రంప్​, మిషిగన్​ గవర్నర్​ మధ్య వాదోపవాదాలూ జరిగాయి.

పెద్ద కుట్రకే ప్లాన్​ చేశారు

గవర్నర్​ వైట్మర్​ కిడ్నాప్​కు కుట్ర పన్నింది ప్రభుత్వ వ్యతిరేక మిలిటెంట్​ సంస్థ అయిన వోల్వరిన్​ వాచ్​మెన్​ అని ఎఫ్​బీఐ అధికారులు తేల్చారు. అయితే, నిజానికి ముందుగా వాళ్లు ప్లాన్​ చేసింది గవర్నర్​ కిడ్నాప్​కు కాదట. అంతకన్నా పెద్ద కుట్రే చేశారట. 200 మందితో లాన్సింగ్​లోని స్టేట్​ క్యాపిటోల్​ బిల్డింగ్​పై ఎటాక్​ చేసి అందులోని అందరినీ బందీ చేయాలని ప్లాన్​ చేశారని అధికారులు చెప్పారు. అయితే, అది కుదిరేలా కనిపించకపోవడంతో వెకేషన్​ హోమ్​లో ఉన్న గవర్నర్​ను కిడ్నాప్​ చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. వోల్వరిన్​ వాచ్​మెన్​ గ్రూపులోని ఏడుగురు యాంటీ టెర్రరిజం చట్టాలను ఉల్లంఘించారని మిషిగన్​ అటార్నీ జనరల్​ డేనా నెస్సెల్​ చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌర యుద్ధానికి తెరతీసేందుకు 2019 నవంబర్​ నుంచే ఫేస్​బుక్​లో మెంబర్లను రిక్రూట్​ చేసుకోవడం మొదలుపెట్టిందన్నారు.

తీవ్రవాదానికి ట్రంప్​ ప్రోత్సాహం: వైట్మర్

కిడ్నాప్​ కుట్రకు సంబంధించి ట్రంప్​పై ఫైర్​ అయ్యారు వైట్మర్​. రాజకీయ తీవ్రవాదాన్ని ట్రంప్​ ప్రోత్సహిస్తున్నారని, పోయిన వారం జరిగిన డిబేట్​లో ట్రంప్​ వైఖరే అందుకు నిదర్శనమని అన్నారు. ఇటీవల జరిగిన ఫ్లాయిడ్​ ఘటనను ఖండించాల్సిందిగా డిమాండ్​ చేసినా.. అందుకు ఒప్పుకోకుండా దాడి చేసిన వాళ్లనే పొగిడారని గుర్తు చేశారు. ఇద్దరు లీడర్ల మధ్య చర్చ జరిగినప్పుడు ఆయన డొమెస్టిక్​ టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడడం, వాళ్ల చర్యలు మంచివని చెప్పడం దారుణమన్నారు.

సాయం చేసినం..థ్యాంక్స్ చెప్పాలె: ట్రంప్

వైట్మర్​ ఆరోపణలకు ట్రంప్​ కూడా దీటుగా బదులిచ్చారు. గవర్నర్​ పనితీరు చాలా దారుణంగా ఉందని, ఆమె పాలన అసలేం బాగాలేదని ఆమే చెప్పుకుంటున్నారని విమర్శించారు. మిషిగన్​ గవర్నర్​ కిడ్నాప్​ కుట్రను భగ్నం చేసినట్టు తమ జస్టిస్​ డిపార్ట్​మెంట్​ అండ్​ ఫెడరల్​ లా ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు చెప్పారన్నారు. చేసిన సాయానికి థ్యాంక్స్​ చెప్పాల్సింది పోయి తనను రేసిస్ట్​ అని అవమానిస్తారా అని ప్రశ్నించారు.