మద్యం తాగి డ్యూటీకెళ్లిన టీచర్ సస్పెన్షన్ .. ఉత్తర్వులు జారీ చేసిన గద్వాల కలెక్టర్

మద్యం తాగి డ్యూటీకెళ్లిన టీచర్ సస్పెన్షన్ .. ఉత్తర్వులు జారీ చేసిన గద్వాల కలెక్టర్

గద్వాల, వెలుగు: స్టూడెంట్స్ కు విద్యాబుద్ధులు నేర్పాల్సిందిపోయి.. మద్యం తాగి డ్యూటీకి వెళ్లి  న్యూసెన్స్ చేసిన టీచర్ సస్పెండ్ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం  చిన్న ధన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ మంగళవారం మద్యం తాగి డ్యూటీకి వెళ్లాడు. టీచర్ పరిస్థితిని గమనించి గ్రామస్తులు ప్రశ్నించగా..‘తాగి డ్యూటీకి వస్తా.. కలెక్టర్ కు.. అడిషనల్ కలెక్టర్ కు లంచమిచ్చి, మళ్లీ డ్యూటీకి ఎక్కుతా.. మీరెవరూ నన్ను ఏమీ చేయలేరు’’ అంటూ స్టూడెంట్స్ ముందే టీచర్ న్యూసెన్స్ చేశాడు. స్కూల్ కాంపౌండ్ లోని చెత్తకుప్పలో పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ స్పందించి బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.