
- ముగ్గురు అర్చకులు సస్పెండ్
అలంపూర్, వెలుగు : జోగులాంబ ఆలయ ఈవోపై బదిలీ వేటుపడగా.. ముగ్గురు అర్చకులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఆలయంలో పనిచేసే అర్చకులు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఏపీలోని ఓ రాజకీయ నాయకుడి వివాహ వేడుకలకు హాజరై, ఆశీర్వచనం అందజేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో స్పందించిన ఎండోమెంట్ ఆఫీసర్లు ఈవో పురేందర్‌ను గద్వాల జమ్ములమ్మ ఆలయానికి ట్రాన్స్‌ఫర్ చేయగా.. అర్చకులు విక్రాంత్ శర్మ, వెంకటకృష్ణ, కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఆఫీసర్లు బుధవారం ఆర్డర్స్ జారీ చేశారు. జడ్చర్ల మండలం గంగాపురం ఆలయ ఈవోగా పనిచేస్తున్న దీప్తికి జోగులాంబ ఆలయ బాధ్యతలు అప్పగించారు.