 
                                    రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆపదొస్తే కాపాడాల్సిన పోలీసే.. అమానుషంగా ప్రవర్తించాడు. మైనర్ పై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన శంకర్ పల్లిలో చోటుచేసుకుంది. శంకర్ పల్లికి చెందిన వడ్డే శేఖర్ హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన శంకరపల్లిలోని తన ఇంటికి దగ్గరలోని ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో.. అప్రమత్తమైన స్థానికులు శేఖర్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసలకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శేఖర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
For More News..
ఎన్టీఆర్ బాటలో మహేష్ బాబు
ఏపీ వరద బాధితులకు ఎన్టీఆర్ సాయం

 
         
                     
                     
                    