డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డ కానిస్టేబుల్ సస్పెండ్

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డ కానిస్టేబుల్ సస్పెండ్

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన బహదూర్ పుర పోలీసు కానిస్టేబుల్ వెంకటేష్ ను సస్పెండ్ చేస్తూ  హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి  రాజేంద్రనగర్ పరిధిలో రోడ్డుపై పోలీసులు డ్రంక్ ఎండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా.. అదే సమయంలో బహదూర్ పుర  కానిస్టేబుల్ వెంకటేష్ అటువైపు వచ్చాడు. మద్యం తాగినట్లు అనుమానం రావడంతో డ్రంక్ టెస్టులు చేస్తుండగా తాను స్టాఫ్ నని.. బహదూర్ పుర కానిస్టేబుల్ అంటూ ఐడీ కార్డు చూపించాడు. అయినప్పటికీ టెస్టులు చేస్తున్న పోలీసులు వెంకటేష్ కు టెస్టులు చేయగా పాజిటివ్ రావడం కలకలం రేపింది.
 డ్రంక్ టెస్టులో అతనికి 36 పాయింట్లు రావడంతో అతని బైకును వెంటనే సీజ్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. అతనికి ఎలాంటి మినహాయింపులు లేకుండా కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. ఎఫ్ఐఆర్ రిపోర్టు, నివేదికపై హైదరాబాద్ సీపీ బుధవారం ఉదయం స్పందించారు. పోలీసు సిబ్బందికి సైతం ఎలాంటి మినహాయింపులు లేవని.. నిబంధనలు అందరికీ సమానమేనంటూ సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.