
- నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు: విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో లోవోల్టెజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకుని తండాలో రూ. 2. 80 కోట్ల వ్యయంతో నూతన విద్యుత్ సబ్-స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సబ్ స్టేషన్ నిర్మాణం చేయకుండా తీవ్ర జాప్యంతో కాలయాపన చేసిందన్నారు.
విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్న గిరిజనుల దశాబ్దాల కల సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ దేననిన్నారు. అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ పరిధిలోని అలీనగర్‌లో సుమారు రూ. 6 లక్షల తో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ చైర్మన్ శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కాలసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.