ఉల్లిపాయల ఎగుమతులపై కొనసాగనున్న బ్యాన్‌‌‌‌‌‌‌‌

ఉల్లిపాయల ఎగుమతులపై కొనసాగనున్న బ్యాన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన బ్యాన్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతుందని కన్జూమర్ అఫైర్స్‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ రోహిత్ కుమార్ పేర్కొన్నారు.  ఇవి అందుబాటు ధరల్లో ఉండేలా చూడడమే ప్రభుత్వ ప్రయారిటీ  అన్నారు. ఉల్లి ఎగుమతులపై ఈ ఏడాది మార్చి 31 వరకు బ్యాన్ విధిస్తూ కిందటేడాది డిసెంబర్ 8 న ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

కాగా, బ్యాన్ ఎత్తేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఉల్లిపాయల ధరలు లసల్‌‌‌‌‌‌‌‌గాన్‌‌‌‌‌‌‌‌ (అతిపెద్ద ఉల్లిపాయల హోల్‌‌‌‌‌‌‌‌సేల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌) లో  ఫిబ్రవరి 19 న 41 శాతం పెరిగి క్వింటా రూ.1,800 కు చేరుకుంది.  ఫిబ్రవరి 17 న  క్వింటా ఉల్లిపాయల రేటు రూ.1,280 పలికింది. రబీ  పంట చేతికొచ్చినా  సాధారణ ఎలక్షన్స్ ముందు బ్యాన్‌‌‌‌‌‌‌‌ ఎత్తేసే అవకాశం లేదని అంచనా.