అదృష్టమంటే ఇతడిదే .. సెకన్ లేట్ అయితే ప్రాణాలు పోయేవి

అదృష్టమంటే ఇతడిదే .. సెకన్ లేట్ అయితే ప్రాణాలు పోయేవి

ఏదైనా ప్రమాదం నుంచి బయటపడ్డా.. లాభం జరిగినా  పొద్దున్న లేసి  ఎవరి ముఖం చూశాడో.. ఏమో కానీ ఈ రోజు  వీడి అదృష్టం బాగుందిరా  అంటాం.. నిజంగా అదృష్ణం, దురదుష్టం అనేవి నమ్మోచ్చో లేదో కానీ. కొన్ని సార్లు కొన్ని ఘటనలు చూస్తే నిజంగా నమ్మాలనిపిస్తాయి. సెకన్ల తేడాతో ప్రాణాలు కోల్పోవడం.. ప్రమాదాల నుంచి తప్పించుకున్న ఘటనలు మనం చాలా చూశాం.

 లేటెస్ట్ గా ఇవాళ(జూన్ 14) ఉదయం 10 గంటల17 నిమిషాలకు మహబూబ్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాద  ఘటనలో ఓ వ్యక్తి జస్ట్ సెకన్  తేడాతో  రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  సెకన్ ఆలస్యం అయితే కంటైనర్ ను ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయేవాడు..సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటన చూస్తే  నిజంగానే అతడిది అదృష్టమనే  అంటారు.

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజి దగ్గర  కర్నూల్ వైపు వెళ్తున్న ఓ  భారీ కంటైనర్ అదుపుతప్పి.. డివైడర్ ను దాటి ఇవతలి వైపు వచ్చింది.  అయితే రెప్పపాటు సమయం తేడాతో  కంటైనర్ ఎదురుగా వస్తున్న   టూ వీలర్ వెహికల్ ను ఢీ కొట్టేది.  ఒక్క సెకన్ అతడి వెహికల్ ముందుగా వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.