పాలేరు సీటు కోసం మొదలైన పోటీ.. సీపీఎం వర్సెస్ బీఆర్ఎస్

పాలేరు సీటు కోసం మొదలైన పోటీ.. సీపీఎం వర్సెస్ బీఆర్ఎస్

అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రాకముందే ఖమ్మం జిల్లాలో పాలేరు సీటుపై పోటీ మొదలైంది. కాంగ్రెస్ నుంటి బీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి కందాల ఉపేందర్ రెడ్డితో పలువురు ఖమ్మంలోని పాలేరు సీటు తమదంటే తమదని  బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన గానీ, క్లారిటీ గానీ ఇవ్వకపోయినా సీటు గురించి పదే పదే వివాదాలు సృష్టించుకుంటున్నారు. ఈ క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి బీఆర్ఎస్ సహకారంతో పోటీ చేస్తామని చెప్పడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా సీపీఎం అభ్యర్థిగా తమ్మినేని పోటీపై స్పందించిన కందాల ఉపేందర్ రెడ్డి.. కామ్రేడ్లకు ఓట్లేసే రోజులు పోయాయని ఆరోపించారు. జీళ్ల చెరువులో ఆట పోటీలలకు బహుమతుల ప్రధానోత్సవంలో ఎమ్మెల్సీ తాత మధుసుధన్ పాలేరు సీటు కందాల ఉపేందర్ రెడ్డిదే అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు , ఆశలు పెట్టుకోవద్దని చెప్పడం మరోసారి కామ్రేడ్ల - గులాబోళ్ళ సీటు గొడవ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కామ్రేడ్లను, కందాలను కాదని మాజీ మంత్రి తుమ్మలకు టికెట్ ఇస్తే ఎలాంటి వివాదం ఉంటబోదని, ఆయనైతే అందర్నీ కలుపుకుపోతారని, అలా చేస్తే కామ్రేడ్లు సైతం సహకరిస్తారనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.