Miss World 2025: మిస్ వరల్డ్ కౌంట్ డౌన్ స్టార్ట్.. హైదరాబాద్ కు క్యూ కట్టిన విదేశీ అతిధులు..

Miss World 2025: మిస్ వరల్డ్ కౌంట్ డౌన్ స్టార్ట్.. హైదరాబాద్ కు క్యూ కట్టిన విదేశీ అతిధులు..

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందనే. మే 31న జరగనున్న 72వ మిస్ వరల్డ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో మిస్ వరల్డ్ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇక మిస్ వరల్డ్ వేడుకలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి అందగత్తెలు ఇప్పటికే హైదరాబాద్ లో దిగిపోయారు. కంటెస్టెంట్లతో పాటు విదేశీ అతిధుల రాక కూడా పెరిగింది. దీంతో మంగళవారం ( మే 6 )  శంషాబాద్ ఎయిర్ ఎయిర్ పోర్టు సందడిగా మారింది.

ఈ క్రమంలో మిస్ ఫ్రాన్స్ అగథా లో కాయేట్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ఆమెకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికింది అధికారుల బృందం.ఇక ఇక మిస్ వరల్డ్ కంటెస్ట్ నిర్వహణ బాధ్యులైన క్లారా లసీ కేట్, ఎమ్మా లూయిస్ గ్రే కూడా హైదరాబాద్ చేరుకున్నారు. వీరితో పాటు బ్రిటిష్ అఫీషియల్స్ ఐరీన్ గాసా సెర్రా, క్వన్నాల్యానా రతనఫోల్ పీటర్స్, సుసానా టీక్సీరా ఫెర్రాజ్ లు హైదరాబద్ చేరుకున్నారు. వీరికి సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు అధికారులు. 

►ALSO READ | విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్.. ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌

ఇదిలా ఉండగా.. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, సంస్కృతిని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు చూపించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా.. మిస్ వరల్డ్-2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇక్కత్‎పై ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.